ప్రతి ఒక్కరూ బయో పెట్రోల్ వినియోగించాలి : నిరంజన్ రెడ్డి

-

వనపర్తి జిల్లాలోని నాగవరం, అంకుర్ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన‌ బయో పెట్రోల్ పంపులను మంత్రి నిరంజ‌న్ రెడ్డి, క‌లెక్ట‌ర్ షేక్ యాస్మిన్ భాష క‌లిసి మంగ‌ళ‌వారం ప్రారంభించారు. ఈ సందర్బంగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ బయో పెట్రోల్ వినియోగించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆగ్రో పెట్రోల్ పంపులను ఏర్పాటు చేసినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

 

 

పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ కొరకు బయో పెట్రోలు ప్రతి ఒక్కరు వాడాలని సూచించారు మంత్రి నిరంజన్ రెడ్డి . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బయో పెట్రోలు ఉత్పత్తులను పెంచి త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటుందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బయో పెట్రోలు ఉత్పత్తులను పెంచి త్వరలో రాష్ట్రవ్యాప్తంగా బయో పెట్రోల్ పంపులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటుందని తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version