శ్రావణమాసం వచ్చిందమ్మ – సంబరాలు తెచ్చిందమ్మ, ఆగస్టు 27న సాయంత్రం 6 గంటలకు మీ జీ తెలుగులో!

-

హైదరాబాద్, 23 ఆగస్టు: శ్రావణమాసం అనగానే భక్తుల కోలాహలంతో నిండిన గుళ్ళు, వ్రతాలు, పూజలు, పాటలు మరియు జాతరలు గుర్తుకురావడం సహజం. శ్రావణమాసం సందర్భంగా అదే సందడిని మీ టీవీ స్క్రీన్స్ పై ఆవిష్కరించనుంది జీ తెలుగు. శ్రావణ మాసం వేడుకల హడావిడి, సందడి, వైభవం, ఉల్లాసం మునుపెన్నడూ లేనంతగా ఈ పవిత్ర మాసంలో వినోదాల విందు ఇచ్చేందుకు జీ తెలుగు సిద్ధమవుతోంది. అంతేకాదు మీ అభిమాన బుల్లితెర తారలు వారి అద్భుత ప్రదర్శనలు, వినోదాత్మక స్కిట్లు మరియు ఆటలతో మిమ్మల్ని థ్రిల్ చేసేందుకు రెడీగా ఉన్నారు.

ఎనర్జిటిక్ యాంకర్ రవి, సిరి హనుమంతు జంటగా హోస్ట్ చేస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమానికి టాలీవుడ్ బ్యూటీ నేహా శెట్టి, కార్తికేయ, ఎస్.కె.సురేష్ కొండేటి, సంపూర్ణేష్ బాబు అతిథులుగా విచ్చేసి సందడి చేయనున్నారు. శ్రావణమాసం స్పెషల్ ‘శ్రావణమాసం వచ్చిందమ్మ‌‌‌‌- సంబరాలు తెచ్చిందమ్మ’ ఆగస్టు 27 ఆదివారం సాయంత్రం 6 గంటలకు మీ జీ తెలుగులో!

జీ తెలుగు పాపులర్ సీరియల్స్ అయిన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి, త్రినయని, గుండమ్మ కథ, శుభస్య శీఘ్రం, రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, మావారు మాస్టారు, పడమటి సంధ్యా రాగం సీరియల్స్ లోని జోడీలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రేక్షకులకు వినోదం పంచనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో మరో ప్రత్యేకత ఏంటంటే.. స్పెషల్ గిఫ్ట్ అయిన అమ్మవారి కానుక కోసం పోటీ పడుతూ ఒక్కో జంట వేదికపైకి వస్తుంది. అద్భుత ప్రదర్శనలు, సరదా సంభాషణలతో ఉత్సాహంగా సాగే కార్యక్రమంలో ‘అయిగిరి నందిని..’ పాటకు పాపులర్ సింగర్ స్మిత చేసిన డ్యాన్స్ ప్రతి ఒక్కరినీ భక్తిపారవశ్యంలో మునిగిపోయేలా చేస్తుంది. ఆషిక, ఆహానా భక్తిరస ప్రదర్శన అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. ఆ తర్వాత సురేష్ కొండేటి నృత్య ప్రదర్శన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. జీ తెలుగు కళాకారులు అంతా కలిసి పూజ చేసి అమ్మవారిని ప్రార్థిస్తారు.

ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచేందుకు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఈ షోలో భాగం కావడం విశేషం. అంతేకాదు ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవికి మెగా బర్త్ డే కేక్ కటింగ్ వేడుకను కూడా నిర్వహించనున్నారు. వీటితోపాటుగా, సీరియల్ హీరోయిన్లు పాడటం, ఆ తర్వాత శ్వేతా నాయుడు- పండు, స్రవంతి- అర్జున్ అంబటి, యస్మి- దిలీప్, అరియానా- కెవ్వు కార్తీక్, శ్రీప్రియ-జెస్సీ, భానుశ్రీ- రవికృష్ణ, మెహబూబ్- భ్రమరాంబిక లవ్ థీమ్ పెర్ఫార్మెన్స్ లు అందరినీ ఆకట్టుకుంటాయి.

ఈ వేడుకలో మరింత వినోదం పంచడం కోసం నటీనటులంతా కొబ్బరి పొట్టు తీయడం, చిల్లు గారెలు తయారు చేయడం, మ్యూజికల్ చైర్స్, కోలాటం వంటి ఆటలతో సందడి చేయనున్నారు. చివరగా శ్రావణ లక్ష్మి పోటీ విజేతని ప్రకటించడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ ఆదివారం మరింత వినోదాత్మకంగా మార్చడానికి జీ తెలుగు సిద్దంగా ఉంది, మీరూ సిద్ధం కండి!

శ్రావణ మాస ఉత్సవం ‘శ్రావణమాసం వచ్చిందమ్మ ‌‌‌‌- సంబరాలు తెచ్చిందమ్మ’ ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో!

Read more RELATED
Recommended to you

Exit mobile version