చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ ప్రక్రియ ప్రారంభం

-

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్ -3 ప్రాజెక్టు చివరి దశకు చేరుకుంటోంది. ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషికి తగ్గ ఫలితం కనిపించనుంది. ఇప్పటికే చంద్రుడికి అత్యంత సమీపంలో చంద్రయాన్-3 పయనిస్తోంది. ఇక చంద్రుడిపై చంద్రయాన్ సాఫ్ట్ ల్యాండింగ్ అనేది శాస్త్రవేత్తల ముందున్న అతిపెద్ద సవాల్ అని చెప్పొచ్చు. చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది.అయితే.. క్షణం క్షణం ఉత్కంఠ పరిస్థితిని అంచనా వేస్తున్నారు అధికారు. ప్రస్తుత్తం చంద్రుడికి 31 కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్‌-3 ఉంది. ల్యాండర్‌ నుంచి వస్తున్న సిగ్నల్స్‌ను క్షుణ్ణంగా అధికారులు పరిశీలిస్తున్నారు. చంద్రుడి ఉపరితలం వైపుగా చంద్రయాన్‌-3 దూసుకోపోతోంది. చివరి 15 నిమిషాలు కీలకం. చంద్రయాన్‌పై ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఆసక్తి ఎదరుచూస్తున్నారు.


ఇప్పటికే ల్యాండర్ మాడ్యూల్‌కు సంబంధించిన కక్ష్యను విజయవంతంగా తగ్గించడం జరిగింది.జూలై 14వ తేదీన నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ -3 గత గురువారం రోజున ప్రపల్షన్ మాడ్యూల్ నుంచి సక్సెస్‌ఫుల్‌గా వేరుపడింది. ఇక చంద్రయాన్-3 ప్రయాణంకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్అప్‌డేట్స్ మీకోసం.

Read more RELATED
Recommended to you

Exit mobile version