నా మాట‌ల్ని త‌ప్పుగా అర్థం చేసుకున్నారు: శృతి‌హాస‌న్

-

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ `గ‌బ్బ‌ర్‌సింగ్‌`. ఈ మూవీకి ముందు వ‌రకు శృతీహాస‌న్ అంటే ఓ ఐర‌న్ లెగ్ అనే ముద్ర వుండేది. `గ‌బ్బ‌ర్‌సింగ్‌` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో శృతిపై ఆ ముద్ద‌ర చెరిగిపోయింది. క‌మ‌ల్‌హాస‌న్ కూతురిగా ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించినా శృతికి ఈ మూవీ త‌రువాతే స్టార్ హీరోయిన్ స్టేట‌స్ ఏర్ప‌డింది.

త‌రువాత శృతిహీస‌న్ తెలుగులో చేసిన రేసు గుర్రం, బ‌లుపు వంటి చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ధ భారీ విజ‌యాల్ని సాధించి క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్ గా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. గ‌త కొంత కాలంగా మైఖేల్ క్రోస‌ల్‌తో డేటింగ్ కార‌ణంగా సినిమాల‌కు దూర‌మైన శృతి ఇటీవ‌లే మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డం మొద‌లుపెట్టింది. ఈ సంద‌ర్భంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలుగు సినిమాల‌పై వివాదాస్ప‌దంగా మాట్లాడింది. నేను కొన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించాను అయితే అవి నాకు ఏమంత గొప్ప‌గా అనిపించ‌లేద‌ని పేర్కొంది. దీనిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో తాజాగా స్పందించింది.

తా‌ను అలా అన‌లేద‌ని కొన్ని తెలుగు మీడియా ప్రచురణ సంస్థ‌లు నేను ఇచ్చిన జాతీయ ఇంటర్వ్యూ నుండి ఒక కోట్‌ను తప్పుగా అన్వయించాయి. అసత్యమైన కథనాలను వ్రాస్తున్నాయి దీనిపై స్పష్టత నివ్వాల‌నుకుంటున్నాను. నా మాటల్ని త‌ప్పుగా అన్వ‌యించారు.  రేసు గుర్రం, గబ్బర్ సింగ్ వంటి చిత్రాలలో భాగమైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారితో క‌లిసి న‌టించిన `గ‌బ్బ‌ర్‌సింగ్‌` నా జీవితాన్నే మార్చేసింది` అని వివ‌ర‌ణ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version