హీరో నిఖిల్ కోసం అలాంటి పని చేసిన శింబు..!

-

ప్రముఖ సినీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో శింబు గురించి.. ఆయన పరిచయం గురించి.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిఖిల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 18 పేజీస్ సినిమాలో భాగం అవబోతున్నారు అంటూ గత కొద్దిరోజుల నుంచి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నిఖిల్ కోసం శింబు స్వరం అందించబోతున్నాడు అంటూ వార్తలు వినిపించినా ఇప్పుడు అదే నిజమైంది. జాతీయ అవార్డు గ్రహీత సంగీత విద్వాంసుడు గోపి సుందర్ ట్యూనింగ్లో శింబు మొదటిసారిగా పాడబోతున్నాడు. అంతేకాదు ఇద్దరూ తమ పాటలకు పారవర్ష అనుభూతిని కలిగించడంలో ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే.

ఈ పాట ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా ఉంటుందని నిర్మాతలు కూడా నమ్మకంగా ఉన్నారు. తాజాగా 18 పేజీస్ సినిమాలో గోపి సుందర్ ట్యూన్ చేసిన “టైం ఇవ్వు పిల్ల టైం ఇవ్వు ” అనే పాట కచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఎందుకంటే శింబు వాయిస్ లో వినడానికి ఫ్యాన్స్ కు కచ్చితంగా ఈ పాట ట్రీట్ అవుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా ప్రచార దశలో ఉండగా ఇటీవల విడుదలైన “నన్నయ రాసిన” పాట అందరికీ బాగా నచ్చింది. కుమారి 21ఎఫ్ సినిమాకు దర్శకత్వం వహించిన పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.. గీత ఆర్ట్స్2 నుండి బన్నీ వాసు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

నిఖిల్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోగా తెరకెక్కబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి. ఇకపోతే కొన్ని నెలల క్రితం వీరిద్దరూ కలిసి నటించిన కార్తికేయ 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ జంటకు మంచి గుర్తింపు కూడా లభించింది. మరి 18 పేజీస్ సినిమాతో ఈ జంట ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version