Dhanush : ‘సార్’ ఫస్ట్ లుక్ రిలీజ్.. ధనుష్ మామూలుగా లేడుగా !

-

తమిళ్ సూపర్ స్టార్ ధనుష్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తీసే సినిమాలు డబ్బింగ్ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. టాలీవుడ్ లోనూ ఫుల్ ఫాలోయింగ్ ఉన్న కోలీవుడ్ హీరో ధనుష్. కానీ ఇప్పటి వరకు ఆయన ఒక్క స్ట్రెయిట్ సినిమా కూడా తీయలేదు.

అందుకే తన తెలుగు ఫ్యాన్స్ కోసం ధనుష్ ఓ సూపర్ హిట్ సినిమా అందించేందుకు రెడీ అయ్యారు. ఆ సినిమాయే ‘సార్’. ఈ సినిమా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా తెలుగు అలాగే తమిళ భాషలలో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటుంది.

తమిళంలో ఈ సినిమాకు వాత్తి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ మేము నుంచి ధనుష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్రం బృందం. ఇందులో ధనుష్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఓ లైబ్రరీలో కూర్చొని… చాలా శ్రద్ధగా పనిచేసుకుంటున్నాడు ధనుష్. ఈ లుక్ చూస్తుంటే.. టైటిల్కు తగ్గట్టుగానే ఈ సినిమాలో ఓ లెక్చరర్ గా ధనుష్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా టీజర్ ను రేపు సాయంత్రం విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version