ప్రస్తుతం భీమ్లానాయక్ మేనియా కొనసాగుతుంది. సంక్రాంతి పండుగకు రావాల్సిన సినిమాను కరోనా కారణంగా వాయిదా వేసి చివరకు ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. భీమ్లానాయక్ ట్రైలర్ విడుదలై యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పవన్ కల్యాణ్ పవర్‌పుల్ యాక్షన్ సీన్లు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా డైలాగ్‌లు, యాక్షన్ సీన్లు వైరలవుతున్నాయి. ఈ తరుణంలోనే సంచలన తార శ్రీరెడ్డి ఓ కామెంట్ చేశారు.
భీమ్లానాయక్ ట్రైలర్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ముఖ్యంగా భీమ్లానాయక్ ట్రైలర్ అనుకున్నంతగా లేదని నెగెటివ్ కామెంట్ చేసింది శ్రీరెడ్డి. బిలో యావరేజ్ అంటూ పేర్కొంది. దీంతో శ్రీరెడ్డి పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన పవన్ అభిమానులు ఆమెపై పలు కామెంట్లు చేశారు. ఆ కామెంట్లను మాత్రం మాటల్లో చెప్పలేం. భీమ్లానాయక్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న నిర్వహించాలనుకున్న తరుణంలోనే ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి మృతి చెందడంతో అది రేపటికి వాయిదా పడింది. నిన్న ట్రైలర్ విడుదల చేసి పవన్ అభిమానుల్లో పూనకాలు తెప్పించారు. ఇక మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఫిబ్రవరి 25 వరకు వేచి చూడాల్సిందే.