ప్రముఖ కన్నడ బ్యూటీ శ్రీ లీలా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన చిత్రం పెళ్లి సందD.. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. కెరియర్ మొదట్లోనే మంచి హిట్ అందుకున్న ఈమె గత ఏడాది చివర్లో రవితేజ తో ధమాకా సినిమా చేసి మరింత పాపులారిటీ దర్శించుకుంది. ఇకపోతే తాజాగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిన శ్రీ లీల ప్రస్తుతం ఈమె చేతిలో ఏకంగా తొమ్మిది ప్రాజెక్టులు ఉండడం గమనార్హం. అంతేకాదు ఇండియాలోనే ఇదొక అరుదైన రికార్డు అని చెప్పవచ్చు.
సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోషూట్లతో యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో హొయలు పోతూ యువతకి చెమటలు పట్టించింది ఈ ముద్దుగుమ్మ. స్లీవ్ లెస్ టాప్ ధరించి నడుము అందాలతో గిలిగింతలు పెడుతోంది. ఇక ఈమె అందాలు చూసి కుర్ర కారు సైతం ఫిదా అవుతున్నారు. అసలే క్రేజ్ ఉన్న హీరోయిన్ పైగా ఇలా గ్లామర్ షో చేస్తే తట్టుకోవడం కష్టం అంటూ నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం..
ఇకపోతే శ్రీ లీలా కెరియర్ విషయానికి వస్తే.. ధమాకా సినిమాకు రూ. 30 లక్షల వరకు డిమాండ్ చేసిన ఈమె ఆ సినిమా మంచి విజయవంతం అయ్యి ఇప్పుడు వరుస అవకాశాలు వస్తుండడంతో కోటి రూపాయల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది. ఇక తాజాగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీళ్ కాంబినేషన్లో వచ్చే యేడాది రాబోతున్న సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా ఎన్నికయింది. మరొకవైపు రాంచరణ్ , బుచ్చిబాబు సినిమాలో కూడా ఈమె సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఏకంగా ప్రభాస్ సరసన రాజా డీలక్స్ లో కూడా అవకాశం దక్కించుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలలో ఈమె నటిస్తున్నట్లు సమాచారం.