శ్రీనువైట్ల ఆస్తుల‌మ్మి సినిమా తీస్తున్నాడా?

-

ఒక‌ప్ప‌టి స్టార్ డైరెక్ట‌ర్ శ్రీనువైట్ల అవ‌కాశాలు లేక ఖాళీగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. ప్లాప్ ల్లో ఉన్నా వ‌చ్చిన అవ‌కాశాలు స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. దీంతో కనీసం చిన్న నిర్మాత‌లు కూడా వైట్ల వైపు చూడ‌టం లేదు. ఇక గ‌తంలో వైట్ల ద్వారా హిట్లు అందుకున్న హీరోలంతా ముఖం చాటేస్తున్నారు. దీంతో వైట్ల కెరీర్ మ‌ళ్లీ మొద‌టికే వ‌చ్చింది. దీంతో ఇప్పుడు శ్రీను వైట్ల నిర్మాత‌గా మారుతున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే మంచు మ‌నోజ్ తో ఓ సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. తాజాగా దానిపై మ‌రింత అప్ డేట్ అందింది. ఆ క‌థ‌ను ఇప్పుడు మ‌ల్టీస్టార‌ర్ గా మార్చుతున్న‌ట్లు స‌మాచారం. మ‌రో హీరోగా ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ని హీరోగా క‌న్వెన్స్ చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడుట‌.

Srinu Vaitla turns on producer

ప్రస్తుతం రామ్ కెరీర్ స‌వ్యంగా లేదు. ఒక‌వేళ ఇస్మార్ట్ శంక‌ర్ గ‌నుక హిట్ అయితే ఛాన్స్ ఇచ్చే అవ‌కాశం లేక‌పోలేదు. గ‌తంలో విష్ణుకు, రామ్ కు వైట్ల బ్లాక్ బ‌స్ట‌ర్లు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక సినిమా ను అనీల్ సుకంర‌ను స‌హ‌క‌రాంతో తానే స్వ‌యంగా నిర్మించాల‌నుకుంటున్నాడుట‌. దీనిలో భాగంగా శంక‌ర్ ప‌ల్లిలో శ్రీనువైట్ల‌కు ఉన్న భూమిని అమ్మేయాల‌నుకుంటున్నాడుట‌. ఆ ల్యాండ్ ను అప్ప‌ట్లో దూకుడు సినిమా హిట్ అయిన‌ప్పుడు 14 రీల్స్ బ్యాన‌ర్ వైట్ల‌కు పారితోషికంగా కాకుండా బ‌హుమ‌తిగా ఇచ్చిందిట‌. ఆ భూమినే ఇప్పుడు అమ్మేసి అనీల్ సుకంర‌తో క‌లిసి సినిమా చేయాల‌నుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టికే బేరం పెట్టి రియాల్ట‌ర్ల‌తో సంప్ర‌దింపులు చేస్తున్నారుట‌. ఆ ప‌నుల‌ను అనీల్ సుంక‌ర చూసుకుంటున్నాడని స‌మాచారం. అన్ని అనుకున్న‌ట్లు గ‌నుక జ‌రిగితే వ‌చ్చే ఏడాది ఆరంభంలో సినిమా ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. దీనిపై ఇంకా పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. శ్రీనువైట్ల చివ‌రి సినిమా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని. ఇందులో ర‌వితేజ హీరోగా న‌టించాడు. కానీ వైట్ల‌-ర‌వితేజ కెరీర్ లో దారుణ‌మైన‌ డిజాస్ట‌ర్ గా మిగిలిపోయింది. ఆ ఎ ఫెక్ట్ శ్రీనువైట్ల‌ను ఇంత వ‌ర‌కూ తీసుకొచ్చింది. అదీ మ్యాట‌ర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version