అలా చేసి కోట్లు సంపాదిస్తున్న స్టార్ కపుల్ ..!!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అచ్చ తెలుగు అమ్మాయిలా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా అలరించింది. ఈమె అసలు పేరు సుహాసిని రాజారత్నం నాయుడు. అయితే ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్నేహ గా తన పేరును మార్చుకుంది. ఈమె ముంబైలో పుట్టి పెరిగింది. అయితే ఆ తరువాత కొన్ని రోజులకు తమిళనాడులో సెటిల్ అయ్యారు. ఇక వీరి కుటుంబానికి చెన్నైలో కుంభకోణం దగ్గర స్నేహ మహల్ అనే ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉన్నది.

ఈమె మొదటి సారిగా మలయాళం లో 2000 సంవత్సరంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక అదే ఏడాది తమిళంలో కూడా ఒక చిత్రంలో నటించింది స్నేహ. ఇక 2001వ సంవత్సరంలో మాత్రం తెలుగులో తొలివలపు చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక అలా ఎన్నో సినిమాలలో నటించిన స్నేహ 2012వ సంవత్సరంలో నటుడు ప్రసన్న ని ప్రేమించి వివాహం చేసుకున్నది. ఇక వీరిద్దరూ కలిసి పలు అడ్వర్టైజ్మెంట్లలో కనిపించడం జరిగింది.

తరుణ్ నటించిన ప్రియమైన నీకు చిత్రం ద్వారా బాగా పాపులర్ అయింది స్నేహ. ఇక ఆ తర్వాత శ్రీరామదాసు, హనుమాన్ జంక్షన్ వంటి చిత్రాలలో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైంది. అయితే సినీ అవకాశాలు తగ్గడంతో పలు యాడ్ లలో తన భర్త తో కలసి నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ జంట కంఫర్ట్ ఫ్యాబ్రిక్, ఆశీర్వాద్, సన్ ఫీస్ట్ మ్యారి లైట్, విమ్, GRT జ్యువెలరీ, వైభవ్ కలెక్షన్స్ ఇలా తదితర ప్రముఖ బ్రాండ్ల యాడ్లలో నటిస్తున్నారు. ఇక వీరి ఇరువురు ప్రతి సంవత్సరం యాడ్ లలోనే 4.8 కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ట్లుగా సమాచారం. మరోపక్క సినిమాలలో అవకాశాలు అందుకుంటూ ఇలా రెండు చేతులా సంపాదిస్తున్నారు స్నేహ తన భర్త ప్రసన్న. ఇప్పటి వరకు కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version