తమకంటే పెద్దవారిని వివాహం చేసుకున్న స్టార్ హీరోలు .!

-

సాధారణంగా ఎక్కడైనా సరే అమ్మాయికి, అబ్బాయికి వివాహం జరిపేటప్పుడు అబ్బాయి కంటే అమ్మాయి వయసు చిన్నదిగా ఉండాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఇప్పుడు పద్ధతులు మారిపోయాయి.. ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మీద ఎలా పుడుతుందో చెప్పడం అసాధ్యం. కులం, మతం, గోత్రం, వయసు ఇలా ఏవి పట్టించుకోకుండా తమ మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటూ జీవితంలో సంతోషంగా ఉన్న వారిని కూడా మనం చూస్తూనే ఉన్నాం.

అయితే ఈ క్రమంలోనే కొంతమంది స్టార్ హీరోలు కూడా తమకంటే పెద్దవారిని ప్రేమించి మరీ వివాహం చేసుకొని వార్తల్లో నిలిచారు. అలా ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా కొంతమంది హీరోయిన్లు తమకంటే చిన్న వయసు కలిగి ఉన్న హీరోలను వివాహం చేసుకుంటున్నారు. వారిలో నమ్రత, మహేష్ బాబు జంట మొదటిగా నిలుస్తుందని చెప్పాలి. వయసులో మహేష్ బాబు కంటే నమ్రత వయసు చాలా పెద్దది.. అయితే ఇప్పటికీ కూడా ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కూడా వయసులో తనకంటే రెండేళ్లు చిన్నవాడైన అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుంది. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి ప్రస్తుతం హాలీవుడ్ ని షేక్ చేస్తున్న ప్రియాంక చోప్రా కూడా తనకంటే 11 ఏళ్లు చిన్నవాడైన నిక్ జోనస్ ను వివాహం చేసుకుంది. మరొకవైపు అనుష్క శర్మ కూడా క్రికెటర్ విరాట్ కోహ్లీ కంటే 6 నెలలు పెద్దది. మరొకవైపు సైఫ్ అలీ ఖాన్ కూడా తనకంటే 13 సంవత్సరాల పెద్దదైన అమృత సింగ్ ను వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరూ మాత్రమే ఇప్పుడు విడాకులు తీసుకున్నారు. కానీ మిగతా జంటలన్నీ కూడా చాలా అన్యోన్యంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version