సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టార్ సింగర్..!

-

ప్రముఖ సింగర్ చిన్మయి ఫెమినిస్ట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. గత ఐదారు సంవత్సరాలుగా రచయిత వైరముత్తుకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఈమె వైరముత్తు పలువురు అమ్మాయిల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అనేది ఆమె మొదటి ఆరోపణ. ముఖ్యంగా వైరముత్తు మీద చిన్మయి గతంలో కేసు కూడా పెట్టింది. ముఖ్యంగా ఆమె వైరముత్తు కి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు చిన్మయిని కోలీవుడ్ నుంచి బహిష్కరణకు గురయ్యేలా చేశాయి. ఇక తరచూ అతడు తప్పు చేసిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి చెప్పే ప్రయత్నం చేస్తుంది.

ఇక ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ వైరముత్తుని కలవగా సీఎం హోదాలో ఉన్న వ్యక్తి స్వయంగా వైరముత్తు ఇంటికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం ఆయనను అభినందించడం ఆమె జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే సీఎం స్టాలిన్ పై ఫైర్ అవుతూ ఒక కామాంధుడు ఇంటికి స్వయంగా సీఎం వెళ్లి అభినందించడమా అంటూ ఒక సందేశాన్ని కూడా పోస్ట్ చేసింది. పలువురు మహిళలను లైంగికంగా వేధించిన ఒక వ్యక్తి ఇంటికి ఇలా గౌరవప్రదమైన స్థానంలో ఉన్న సీఎం స్టాలిన్ స్వయంగా వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం సమాజానికే సిగ్గుచేటు..

2018 నుండి ఇతడి బండారం బయట పెట్టినందుకు నేను కఠిన పరిస్థితులే ఎదుర్కొంటున్నాను. కోలీవుడ్ నుంచి కూడా బహిష్కరించబడ్డాను. అలాంటిది ఒక సీఎం అతని ఇంటికి వెళ్ళాడు అంటే ఆయన పలుకుబడి మనం అర్థం చేసుకోవచ్చు. వైరముత్తుకి అంత బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టే మహిళలు అతడి అరాచకాలు బయట పెట్టడానికి భయపడుతున్నారు అంటూ తన సందేశంలో రాసుకుంది. అయితే 2018లో సింగర్ చిన్మయితో పాటు మరికొంత మంది మహిళలు వైరముత్తుపై వ్యతిరేకంగా కేసు పెట్టినప్పటికీ అవన్నీ నిరాధారంగానే మిగిలిపోయాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version