ఇవాళ ఉదయం అచ్చెన్నాయుడు ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స తగిన రీతిలో సమాధానం చెప్పాడు. బొత్స మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడు ఏవేవో పనికిమాలిన మాటలు మాట్లాడుతాడు, మా ప్రభుత్వం ఏ నిధులను డైవర్ట్ చేయలేదు. ప్రజలు బాగుండాలి అన్న ఉద్దేశ్యంతో ఒక పధకానికి సంబంధించిన నిధులను వేరే పధకానికి ఇచ్చాము అంటూ క్లారిటీ ఇచ్చాడు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు చేసింది ఏమిటో చెప్పమనండి, అంతా దోచుకు తిన్నారు.. ఇప్పుడేమో నీతులు మాట్లాడుతున్నారు అంటూ గట్టిగా చెప్పాడు బొత్స. ఇప్పుడు అధికారం కోసం ప్రజలకు లేని పోనీ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు అంటూ వారి మాటలను తీసిపారేశారు బొత్స. చంద్రబాబు అండ్ బ్యాచ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా సీఎం కావడం కష్టం… 160 రోజులు కాదు కదా 664 రోజులు అయినా చంద్రబాబుకు సీఎం అయ్యే రాత ఇక లేదన్నాడు బొత్స.
బొత్స సత్యనారాయణ: చంద్రబాబు సీఎం కావడం ఒక కల మర్చిపోండి…
-