హీరో విశాల్ ఇంటిపై రాళ్ల దాడి.. ధ్వంసం అయిన అద్దాలు..!

-

ప్రముఖ నటుడు , నిర్మాత విశాల్ ఇంటిపై తాజాగా కొంతమంది గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఇక ఈ మేరకు పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదయింది. ఇక విశాల్ తరఫున ఆయన మేనేజర్ హరికృష్ణ అన్నానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విశాల్ తన కుటుంబంతో కలిసి చెన్నైలోని అన్నా నగర్ లో నివసిస్తున్నారు. సోమవారం రాత్రి ఎరుపు రంగు కారులో వచ్చిన కొంతమంది దుండగులు విశాల్ ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. ఇక అనంతరం అక్కడి నుంచి పరారవడం జరిగింది. అయితే ఈ సంఘటనలో విశాల్ ఇంటి అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

ఇకపోతే దుండగులు దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన రికార్డును కూడా పోలీసులకు అందించారు.. ఇక ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇకపోతే నటుడు విశాల్ షూటింగ్ నిమిత్తం బయటకు వెళ్లిన సందర్భంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే తమిళ్ , దక్షిణ చిత్ర సీమలో ప్రముఖ నటుడు తమిళ సినీ పరిశ్రమ నడిగం సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ ఇంటిపై దాడి జరగడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది . నిజానికి విశాల్ ఇంటిపై ఎవరు దాడి చేశారు? దీని వెనుక ఎవరి హస్తం ఉంది అనే కోణాల్లో పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతున్నారు.

ఇకపోతే ప్రస్తుతం విశాల్ సినిమాల విషయానికి వస్తే.. లాఠీ, మార్క్ అంటోని , తుపరివాలన్ 2 వంటి చిత్రాలలో నటిస్తున్నారు. ఇకపోతే ఈయన నటిస్తున్న లాఠీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.. ఇకపోతే విశాల్ నటించిన తుపరివాలన్ మొదటి భాగం భారీ విజయం సాధించడంతో రెండవ భాగం కోసం అభిమానులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి వుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version