సినిమా చిన్నదైనా పెద్దదైన కథ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అనేదానికి చక్కటి ఉదాకరణ ఉదాహరణ “సు ఫ్రమ్ సో” సినిమా. ఈ సినిమాను అతి తక్కువ బడ్జెట్ తో తియగా భారీగా కలెక్షన్లను రాబట్టింది. ఏకంగా ఈ సినిమాను రూ. 5 కోట్లతో నిర్మించగా ఈ కన్నడ సినిమా రూ. 60 కోట్ల కలెక్షన్లను రాబట్టింది జే.పి. దుమినాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 25న థియేటర్లలో రిలీజ్ అయింది.

ఈ సినిమా ప్రమోషన్లను పెద్దగా చేయకపోయినా మౌత్ టాక్ తో సినీ ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. హారర్ కామెడీ కథాంశంతో రూపొందిన ఈ సినిమా నిన్న తెలుగులో కూడా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది. కాగా ఈ సినిమా కథ చాలా బాగుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగానో కనెక్ట్ అయ్యారు. హారర్ కామెడీ కథాంశంతో రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.