ఇలాంటి సినిమాలు చాలా కష్టం.. చందు మొండేటి ఆసక్తికర కామెంట్స్

-

సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలాజికల్ థ్రిల్లర్స్ గా రూపొందిన చిత్రం ‘రహస్యం ఇదం జగత్’. పురాణాలు,
ఇతిహాసాలకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఇందులో ఉన్నాయని తెలుస్తుండగా..
ఇప్పటి వరకు ఇందులో నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ కి మంచి స్పందన లభించింది. ఇక
పాజిటివ్ అంచనాల మధ్య నవంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే
తాజాగా మూవీ ట్రైలర్ ని సెన్సేషనల్ డైరెక్టర్ చందు మొండేటి  విడుదల చేశారు.

ఈ సందర్భంగా చందు మొండేటి మాట్లాడుతూ.. ‘ఈ టీజర్ చూసి ఎగ్జెట్ ఫీలయ్యాను. పర్టిక్యులర్ గా పర్సనల్ గా నేను వేటికి అయితే ఎక్కువగా ఎగ్జిట్ అవుతానో, కనెక్ట్ అవుతానో.. చదువుతానో, రిసెర్చ్ చేస్తానో.. వాటికి సిమిలర్గా ఈ సినిమా కాన్సెప్ట్ ఉండటంతో ఎగ్జెట్ అయ్యాను. ఇలాంటి సినిమాలు తీయడం చాలా కష్టం. ఐ థింగ్ సో.. ఎనీ థింగ్ రిలేటెడ్ సైన్స్.. జనాలు ఇలాంటి సినిమాలు చూసే మూడ్లో ఉన్నారు. తప్పకుండా ఈ చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది. అందరికి ఆల్ ది బెస్ట్’ అని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version