విజయమ్మ రాసిన లేఖ పై స్పందించిన షర్మిల

-

వైఎస్సార్ బతికి ఉన్నప్పుడే ఆస్తుల పంపకం చేశారన్నది అవాస్తవం అని వైఎస్ విజయమ్మ వెల్లడించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విజయసాయి రెడ్డి ఆడిటర్ గా ఉండటంతో ఆయనకు అన్ని తెలుసు. వైవీ సుబ్బారెడ్డి ఇంటి బంధువుగా సాక్షి సంతకం పెట్టారు. కానీ ఇద్దరూ అవాస్తవాలు మాట్లాడారు. జగన్, షర్మిల పెరుగుతున్నప్పుడే కొన్ని ఆస్తులు జగన్, షర్మిల పేరిట రాజశేఖర్ రెడ్డి రాసిచ్చారని లేఖలో గుర్తుకు చేశారు. ఇది ముమ్మాటికి ఆస్తుల పంపకం కాదని.. దయచేసి ఎవ్వరూ కల్పిత కథలు రాయొద్దు. వారిద్దరూ సమాధానం పొందుతారు. దేవుడు అన్నింటిని పరిష్కారం చూపుతాడని లేఖలో పేర్కొంది విజయమ్మ.

తాజాగా విజయమ్మ రాసిన లేఖ పై స్పందించారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. రాజశేఖర్ రెడ్డి గారు ప్రేమించే ప్రతీ హృదయానికి, ఈ కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతీ ఒక్కరికీ మీ విజయమ్మ చేస్తున్న అభ్యర్థన అంటూ తల్లి లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. జగన్ కు, షర్మిలకు ఆస్తులు సమానంగా పంచాలనేది వైఎస్సార్ అభిప్రాయమని విజయమ్మ స్పష్టం చేసిన విషయం విధితమే. ఆమె లేఖ వైఎస్ అభిమానుల్లో చర్చనీయాంశం గా మారింది. 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version