సుహాస్ “గొర్రె పురాణం” రిలీజ్ డేట్ ఫిక్స్!

-

మంచి కాన్సెప్ట్ కథలను పట్టుకుంటూ, తన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరవుతున్నాడు హీరో సుహాస్. ఇటీవల ప్రసన్నవదనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యంగ్ హీరో.. ఇప్పుడు గొర్రె పురాణం అనే విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు.

ఫోకల్ వెంచర్స్ పతాకం పై సుహాస్ హీరోగా బాబీ దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ వినూత్న కథా చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ఇది ఒక గొర్రె కథ. ఓ గ్రామంలో హిందూ – ముస్లింల మధ్య చిచ్చుపెట్టిన గొర్రె కథ.

ఆ ఊరి ప్రజలు అసలు గొర్రెను ఎందుకు చంపాలనుకున్నారనేదే ఈ సినిమా కథ. ఇక ఈ సినిమాకి పవన్ సిహెచ్ సంగీతాన్ని అందించారు. అలాగే గొర్రెకి దర్శకనటుడైన తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. తాజాగా ఈ సినిమాని సెప్టెంబర్ 20న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు అధికార పోస్టర్ ని సోషల్ మీడియాలో విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version