హుస్సేన్ సాగర్ లో వినాయక నిమర్జనంపై హైకోర్ట్ కీలక నిర్ణయం!

-

హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో వినాయకులను నిమజ్జనం చేయవద్దని తెలంగాణ హైకోర్టులో ఈ నెల 3 న పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. హుస్సేన్ సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత కాబట్టి ప్రతివాదిగా హైడ్రాని కూడా చేర్చాలని పిటిషనర్ కోరారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలనే అమలు చేయాలని హైకోర్టును పిటిషనర్ కోరారు.

ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చివరి క్షణంలో కోర్టును ఆశ్రయిస్తే ఎలా అంటూ పిటీషనర్ ను హైకోర్టు ప్రశ్నించింది. వినాయక చవితికి ముందు పిటిషన్లు వేసి కోర్టుపై ఒత్తిడి పెంచడం సరికాదని సూచించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నందున వాటిని పరిశీలిస్తామని పేర్కొంటూ.. విచారణను ఈ నెల 9 ( నేటికీ ) వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్ పై నేడు మరోసారి విచారణ జరిపిన హైకోర్టు.. తదుపరి విచారణను రేపు జరిపించనున్నట్లు వెల్లడించింది.

ఈ పిటిషన్ పై జస్టిస్ వినోద్ కుమార్ తో కూడిన బెంచ్ రేపు విచారణ జరుపుతుందని తెలిపింది హైకోర్టు. అయితే అనేక రసాయనాలు కలిసిన రంగులతో తయారు చేయబడిన వేల కొద్ది గణేష్ విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో నిమర్జనం చేయడం వల్ల అధికంగా కలుషితం అవుతుందని.. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ లో వినాయక నిమర్జనాలు చేయరాదంటూ గత ఏడాది హైకోర్టు తీర్పును వెలువరించింది. మరి ఈ ఏడాది వినాయక నిమర్జనాలు హుస్సేన్ సాగర్ లో ఉంటాయో..? లేదో..? అన్నది రేపు కోర్టులో తేలనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version