సెప్టెంబర్ ఒకటవ తేదీన డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా , విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ఖుషి . త్వరలో విడుదలవుతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ శరవేగంగా చేపడుతున్నారు చిత్ర బృందం. అందులో భాగంగానే సుమ, రాజీవ్ కనకాల తో.. విజయ్ దేవరకొండ , సమంత ముచ్చటించడం జరిగింది. ముఖ్యంగా ఇంటర్వ్యూలో సమంత కాస్త నవ్వుతూనే సరదాగా సమాధానాలు చెప్పినా.. పెళ్లి టాపిక్ వచ్చేసరికి తన అభిప్రాయాన్ని చెప్పలేక సైలెంట్ గా ఉండిపోయింది. ముఖ్యంగా ఖుషి ఈవెంట్లో సమంతను టార్గెట్ చేసి సుమా పెళ్లి టాపిక్ తీసుకొచ్చిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అందరిని మీ జీవితాలలో ఖుషి ఏంటి? అని అడగగా విజయ్ దేవరకొండ తన లైఫ్ లో ఖుషి అంటే తన ఫ్యామిలీ, పెళ్లి అంటూ చెప్పుకుంటూ పోయాడు. అయితే ప్రతి ఒక్కరు కూడా పెళ్లి ఎందుకు.. ఇప్పుడు సంతోషంగానే ఉన్నావు కదా.. పెళ్లి చేసుకోవడం అవసరమా అన్నట్టు సలహాలు ఇస్తూనే ఉన్నారు.. అని విజయ్ మాట్లాడుతూ ఉండగా మధ్యలో రాజీవ్ కనకాల కలగజేసుకొని.. పెళ్లి కొంతకాలమే బాగుంటుంది అంటూ కౌంటర్ వేశాడు. ఆ పక్కనే సుమ ఇంకొక కౌంటర్ వేసింది. ఏం పర్లేదు విజయ్ పెళ్లి చేసుకోమని నేను సలహా ఇస్తాను.. నువ్వు ఒక్కడివే ఎందుకు సంతోషంగా ఉండాలి అంటూ చివర్లో పంచ్ కూడా వేసింది.
అయితే ఇలా అందరూ ఏదో ఒక కౌంటర్ వేస్తుంటే సమంత మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గానే ఉండిపోయింది. ముఖ్యంగా వాళ్లు వేసే జోకులు విని నవ్వుకుందే తప్ప ఆమె నోరు విప్పి మాట్లాడలేదు.ఇక సుమ సమంత వైవాహిక జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని కామెంట్లు చేసిందా అంటూ నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే సమంతకు ఖుషి అంటే తనకు తాను టైం కేటాయించుకుంటున్నాను అని, తన గురించి తాను ఆలోచించుకుంటున్నానని ప్రస్తుతం ఇదే తన ఖుషి అంటూ చెప్పుకొచ్చింది.