ఎన్నికలు వస్తేనే కేసీఆర్ కి పేదలు గుర్తుకొస్తారు : బండి సంజయ్

-

ఖమ్మంలో కమలం వికసిస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీకి అధికారం ఇచ్చిన ప్రజలు బీజేపీకి అధికారం ఇవ్వాలని చూస్తున్నారని పేర్కొన్నారు బండి సంజయ్. ముఖ్యంగా ఎన్నికలు వస్తేనే కేసీఆర్‌కు పేదలు గుర్తుకు వస్తారు.. తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాలి అన్నారు. 

  కేసీఆర్ పేరు దుబాయ్ శేఖర్ అని..  దుబాయ్ తీసుకుపోతానని.. ముంబయి తీసుకుపోయాడు అని గుర్తు చేశారు. అసలు ఈ కేసీఆర్  ఒక మూర్ఖుడు అని.. బీసీ నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ ని అవమానపరిచిన మూర్ఖుడు అన్నారు బండి సంజయ్.  ఎన్నికలు వస్తేనే దళిత బంధు, రైతుబంధు అన్నీ గుర్తుకు వస్తాయి. ఎన్నికలు పోతే ఏది గుర్తుకు రాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.  ఎన్నికలు వస్తేనే కేసీఆర్ కి పేదలు గుర్తుకొస్తారు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలిసికట్టుగా ముందుకు సాగి తెలంగాణలో రామరాజ్యం తెస్తాం అన్నారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version