‘ద కేరళ స్టోరీ’పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

-

‘ద కేరళ స్టోరీ’ సినిమా విడుదల ముందు నుంచే ఎంతటి వివాదాన్ని రగిలించిందో తెలిసిందే. ఈ వివాదాలే మధ్యే ఎట్టకేలకు సినిమా విడుదలైంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ చిత్రాన్ని ప్రదర్శించడం లేదు. ఈ క్రమంలో ఈ మూవీ విడుదలపై కేరళ హైకోర్టు స్టే నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇవాళ సుప్రీం కోర్టు విచారించనుంది.

ఈ నెల 5న ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదలైంది. అయితే మూడో తేదీనే విడుదలను నిలిపేయాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే కేరళ హైకోర్టులోనే ఈ అంశాన్ని తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. సినిమా టీజర్‌ను వీక్షించిన హైకోర్టు న్యాయమూర్తులు విడుదలపై స్టేకు నిరాకరించారు.

కేరళ నుంచి 32 వేల మంది యువతులను తీవ్రవాద సంస్థ ఐసిస్‌లోకి చేరేలా వారి ముస్లిం స్నేహితులు ప్రలోభపెట్టారని సినిమాలో పేర్కొనడాన్ని పిటిషన్‌లో ఖుర్బాన్‌ అలీ ఆక్షేపించారు.ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టు తలుపుతట్టారు. అలీ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ ఈ కేసులో వాదనలు వినిపించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version