‘ సైరా ‘ పై చిరు భార్య సురేఖ రివ్యూ

-

సైరా నరసింహారెడ్డి చిరంజీవి 151వ చిత్రం. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, రేనాటి సూర్యుడుగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది. ఈ సినిమా అక్టోబ‌ర్ 2న విడుద‌ల కానుంది. ఇక ఈ సినిమాపై మెగ‌స్టార్ చిరంజీవి భార్య సురేఖ మాట్లాడుతూ ఈ సినిమా కొన్ని చోట్ల మేమే సొంతంగా రిలీజ్‌ చేస్తున్నాం. కొన్ని చోట్ల మంచి బిజినెస్‌ అయింది.

‘మనం డబ్బుల గురించి చూడకూడదు. డబ్బు వస్తుందో రాదో తెలియదు కానీ లైఫ్‌ టైమ్‌లో మీకు గొప్ప పాత్ర ఇది. ఆ తృప్తిని డబ్బుతో కొలవలేం. మీ కోరిక తీర్చాలని రామ్‌ చరణ్‌ ఈ సినిమా చేశాడు. ఆ విధంగా వాడు సంతృప్తిగా ఉంటాడు. గొప్ప పాత్ర చేశాను అనే మీ కోరిక నెరవేరింది. నేను మీతో సినిమా చేయాలనే నా కోరిక నెరవేరింది (సురేఖ సమర్పణలో ‘సైరా’ రూపొందింది)’ అని చెప్పింది. అలా ‘సైరా’ విషయంలో ఇంటిల్లిపాదీ ఆనందంగా ఉన్నామ‌న్నారు. అయితే ఆమె సినిమా చూడ‌లేదుకానీ మొత్తం తెలుసుకొని.. అవుట్ పుట్ చాలా బాగా వ‌చ్చింద‌ని సంతృప్తి వ్య‌క్తం చేసింది. అలాగే ఈ సినిమా మీ కెరియ‌ర్‌లోనే దీ బెస్ట్ సినిమా అవుతుంద‌ని ఆమె ఆకాంక్ష వ్య‌క్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version