హైద‌రాబాద్‌లో ఇళ్లు ఎందుకు కొన‌ట్లేదు…?

-

దేశంలోని మొదటి ఏడు నగరాల్లో హౌసింగ్ అమ్మకాలు మరియు కొత్త లాంచ్‌లు క్షీణించాయి. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడు గృహ విక్రయాలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్ లో గృహాల అమ్మకాలు తగ్గుముఖం పట్టడం స్థిరాస్తి వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మ‌రియు ఈ పరిణామం దేశీయ రియల్ ఎస్టేట్ రంగంపై భారీగా పడుతోంది. ఈ సంవ‌త్స‌రం హైదరాబాద్ లో కేవలం 3280 గృహాలు మాత్రమే అమ్ముడుపోయాయి.

వాస్త‌వానికి పోయిన సంవత్సరంతో పోల్చిచూస్తే 32 శాతం తగ్గడం అంటే అది భారీ షాక్ గానే మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అనరాక్ తాజా నివేదిక ప్ర‌కారం.. దేశవ్యాప్తంగానూ ఇదే ధోరణి కనిపిస్తోంది. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో గత ఏడాది 67140 ఇళ్లు అమ్ముడు పోగా.. ఈ ఏడాది 55080 ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 18శాతం అమ్మకాలు పడిపోయాయి. అలాగే అత్యధికంగా దేశంలో ఐటీ సిటీగా పేరు పొందిన బెంగళూరులో గతేడాదితో పోల్చితే ఏకంగా 35శాతం, కోల్ కతాలో 27శాతం పడిపోయాయి.

ప్రధానంగా ఇళ్ల కొనుగోలు పడిపోయవడానికి ఆర్థిక మందగమనంతోపాటు సబ్ వెన్షన్ స్కీమ్ రద్దు – మార్కెట్ సెంటిమెంట్ – వడ్డీ రాయితీ పథకాన్ని నిషేధించడం.. ముహూర్తాలు లేకపోవడం కూడా విక్రయాలు పడిపోవడానికి కారణంగా మార్కెుట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇళ్లు కొనడానికి ముందుకు రావడం లేద‌ని ఇతర వ్యాపార ప్రజలు కూడా సాహసించడం లేదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version