బెజవాడ ఇంద్రకీలాద్రి దసరా శరdevi navaన్నవరాత్రుల కళతో వెలిగిపోతోంది. బెజవాడ దుర్గమ్మ రోజుకో అవతారంతో దర్శనమిస్తోంది. భక్తి కోటి సహనంగా క్యూ లైన్లలో నిలబడి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇంద్రకీలాద్రి కొండంతా సందడిగా మారింది. దీక్షలు తీసుకుంటున్న భవానీలు, మొక్కలు చెల్లించుకుంటున్న భక్తులు. మంగళవాయిద్యాలు.. దుర్గాభవానీ నినాదాలు..ఇలా కోలహలంగా ఉంది.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల కోసం ప్రభుత్వం పోలీసులను భారీగా మోహరించింది. దాదాపు 5 వేల మంది పోలీసులను బందోబస్తు కోసం వినియోగించింది. వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తోంది. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో మంగళవారం భక్తులను నియంత్రించాల్సిన ఓ పోలీసు తానే నియంత్రణ కోల్పోయాడు.
ఉన్నట్టుండి ఓ పోలీసు అర్థనగ్నంగా హల్ చల్ చేశాడు.. చొక్కా విప్పేసి కొండపై నినాదాలు చేశాడు. దీంతో ఈ పోలీసు ప్రవర్తనతో అంతా అవాక్కయ్యారు. భక్తులు ఇదేం చోద్యం అంటూ ముక్కున వేలేసుకున్నారు. అమ్మవారి టోల్ గేట్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇలా ఈ పోలీసు ఎందుకు చేశాడన్నది మాత్రం తెలియరాలేదు.
పోలీసు ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే సదరు పోలీసు అర్థనగ్నంగా నిరసన తెలిపినట్టు సమాచారం. పోలీసు నిరసనతో అటుగా వచ్చిన మీడియా వారు దాన్ని షూట్ చేయబోగా.. పోలీసులు అడ్డుకున్నారు. నిరసన తెలుపుతున్న పోలీసును సముదాయించే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఈ పోలీసు నిరసన కొద్దిసేపు కలకలం రేపింది.