Swag Teaser: శ్రీవిష్ణు “స్వాగ్” టీజర్ రిలీజ్

-

హీరో శ్రీవిష్ణు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా సామజవరగమన, ఓం బీమ్ బుష్ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న శ్రీ విష్ణు.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. హసిత్ గోలి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ “స్వాగ్” లో హిలేరియస్ రోల్ లో శ్రీ విష్ణు కనిపించనున్నాడు.

శ్రీవిష్ణు నటించిన “రాజరాజ చోరా” మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. ఈ సినిమా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే కామెడీ ఎంటర్టైనర్. సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటిస్తోంది.

లాగే రీతు వర్మ, దక్ష నగర్కర్, శరణ్య ప్రదీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీ విష్ణు గెటప్ కూడా పూర్తి భిన్నంగా ఉండబోతోంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేసింది చిత్రం బృందం. ఈ టీజర్ అధ్యంతం ఎంటర్టైనర్ గా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version