జనసేనలో నామినెటెడ్ జాబితా సిద్దమైందా..? నేతలకు పవన్ ఏం చెబుతున్నారు..?

-

జనసేనలో నామినెటెడ్ పదవుల జాబితా సిద్దమైందా..? పోస్టుల పంపకంపై లెక్క కుదిరిందా..? ఎవరికి పదవులు.. ఎవరికి బుజ్జగింపులు..? అధినేత ఇచ్చిన అభయమేంటి..? ప్రస్తుతం ఇవే చర్చలు జనసేనలో జరుగుతున్నాయి.. కూటమి గెలుపులో కీలకంగా వ్యవహరించిన జనసేన.. పదవుల విషయంలోనూ పక్కా ప్లాన్ తో ముందుకెళ్తోంది.. ఎవరికిపదవులు ఇవ్వాలి.. ఎవరిని బుజ్జగించాల అనే ఆలోచనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ఉన్నారట..

పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన నేతలకు, కార్యకర్తలకు నామినెటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.. అయితే ఆ నేతలు, కార్యకర్తలు ఎవరనే క్లారిటీని పవన్ కల్యాణ్‌ ఇవ్వలేదు.. సీట్ల సర్దుబాటులో త్యాగాలు చేసింది జనసేన.. 175 అసెంబ్లీ స్తానాల్లో కేవలం 21 ఎమ్మెల్యే స్థానాలు. మూడు ఎంపీ సీట్లు తీసుకుని అన్నింటా విజయం సాధించింది.. గత ఎన్నికల్లో టిక్కెట్లు త్యాగం చేసిన నేతలకే నామినెటెడ్ పదవుల్లో ప్రయారిటీ ఇవ్వాలని పవన్ నిర్ణయించారట..

మొదటి విడతలో పదవులు రాకపోయినా.. భవిష్యత్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ప్రాధాన్యత ఉంటుందని పవన్ కళ్యాణ్‌ చెబుతున్నారట.. పార్టీ బలోపేతంపై దృష్టి పడితే పదవులు వాటంతట అవే వస్తాయని.. ఇటీవల జరిగిన ఇంటర్నల్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ముఖ్య నేతలకు సూచించారట.. ఇప్పటికే జాబితా సిద్దమైందని.. కీలకమైన నేతలకు పదవులు ఖాయమని ఆయన వెల్లడించినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version