మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా వస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమాలో రణ రంగం మొదలైంది. సినిమాలో యుద్ధ సన్నివేశానికి 50 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నారని ఈమధ్య వార్తల్లో వచ్చింది. ప్రస్తుతం ఆ వార్ సీన్ చేసేందుకు యూనిట్ మొత్తం జార్జియా వెళ్లారని తెలుస్తుంది. జార్జియాలో చుట్టూ కొండలు.. మధ్యలో ఖాళీగా ఉన్న లొకేషన్ ఫిక్స్ చేశారు.
వార్ సీక్వెన్స్ కు పర్ఫెక్ట్ లొకేషన్ అని ఫిక్స్ అయిన తర్వాతే జార్జియాకు యూనిట్ మొత్తాన్ని తీసుకెళ్లడం జరిగింది. లాంగ్ షెడ్యూల్ గా వార్ సీక్వెన్స్ మొత్తం ముగించుకుని కాని మళ్లీ హైదరాబాద్ వచ్చేది లేదట. అందుకోసం చిరంజీవి కూడా అంతా సిద్ధం చేసుకుని వెళ్లారట. ఇక ఈ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి సైరా రణ రంగం షూట్ చేసే లొకేషన్ ను ఓ వీడియో తీసి బయటకు వదిలారు. టెంట్లేసుకుని మరి షూటింగ్ కు వెళ్లిన చిత్రయూనిట్ బాగానే కష్టపడుతున్నట్టు తెలుస్తుంది.
రణరంగం అంత గొప్పగా ఏం లేకున్నా దీన్ని సినిమాలో ఇంకెలా చూపిస్తారో అని మెగా ఫ్యాన్స్ ఎక్సైటింగ్ గా ఉన్నారు. ఈమధ్యనే సైరా నుండి రిలీజైన టీజర్ సంచలనం సృష్టిస్తుండగా సినిమా తప్పకుండా అందరి అంచనాలను అందుకుంటుందని అంటున్నారు.