RRR Pre-Release Event : ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఉద్రిక్త‌త

-

క‌ర్నాట‌క రాష్ట్రంలో నేడు ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హిస్తున్న విషయం తెలిసిందే. కాగ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నేడు క‌ర్నాట‌క‌లోని చిక్బ‌ల్లా పూర్ లో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రుగుతుంది. అభిమానులు అంద‌రూ ఒకే సారి బారీ గెట్లు దూకి స‌భా స్థ‌లానికి వ‌చ్చారు. అంద‌రూ క‌లిసి ఒకే సారి రావ‌డంతో తీవ్ర ఉద్రిక‌త్త జ‌రిగింది. అభిమానుల కోసం పెర్చిన కూర్చిల‌న్నీ కూడా చెల్లా చెదురుగా ప‌డిపోయాయి.

అంతే కాకుండా కూర్చిల‌న్నీ విరిగిపోయి… ఒక గుట్ట‌ల మారిపోయింది. ఒకే సారి అభిమానులు రావ‌డంతో తొక్కిసాల‌ట కూడా జ‌రిగినట్టు స‌మాచారం. కాగ‌ క‌ర్నాటక లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కావ‌డంతో దాదాపు మూడు రాష్ట్రాల నుంచి అభిమానులు భారీ సంఖ్య‌లో చేరుకున్నారు. భారీ సంఖ్య‌లో వ‌చ్చిన అభిమానుల‌ను పోలీసులు కంట్రోల్ చేయ‌లేక పోయారు. దీంతో అభిమానులు గెట్ల‌ను బ‌ద్ధ‌లు కొట్టుకుని లోనికి వ‌చ్చారు. ఈ ఆక‌స్మ‌తు ఘ‌ట‌న‌కు పోలీసుల‌తో పాటు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం కూడా అవ‌క్కాయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version