Thaman: ఫ్లైట్ లో వకీల్ సాబ్… థమన్ ట్వీట్ వైర‌ల్

Thaman: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్, ఆయ‌న‌కు ఉన్న‌ సార్ట్ డాం మాములు కాదు. ఆయ‌న‌కు సామాన్య ప్రేక్ష‌కులే కాదు. సినీ సెల‌బ్రెటీల్లో కూడా చాలా మంది ఫ్యాన్ ఉన్నారు. ఆయ‌నను దేవునిగా కొలిచే ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశ‌యోక్తి కాదు. తాజాగా యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ .. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆయ‌న నెట్టింట్లో పోస్టు చేశాడు. అది కాస్త వైరల్ అవుతోంది.

తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఫ్లైట్‌లో వెళ్తూ ఈ సినిమాను చూస్తున్నట్టు ట్విట్టర్ లో పేర్కొన్నాడు. తాను విమానంలో 37,000 అడుగుల ఎత్తులో ‘వకీల్ సాబ్‌’ సినిమా చూస్తున్నానని చెప్పాడు. మానిటర్‌లో ప్లే అవుతున్న ‘పద పద’ పాటను తమన్ కూడా పాడారు. ‘వకీల్ సాబ్’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రాక్స్ నవంబర్ 16 న విడుదల అవుతాయని వెల్లడించారు. ఈ చిన్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం వకీల్ సాబ్. భారీ అంచనాల మధ్య థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలాంటి ఫలితం అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా సమయంలో రిలీజ్ అయినా కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబ‌ట్టింది. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఇక అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించటంతో పాటు రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించింది. అలాగే థమన్ మ్యూజిక్ కూడా సినిమాకు హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా ఆయన ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్.. పాటలు సినిమా రేంజ్ పెంచేసాయి. మగువ మగువ పాట అయితే మరో స్థాయిలో ఉంది.

ఇక థ‌మ‌న్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప‌వ‌న్ న‌టిస్తున్న భీమ్లా నాయ‌క్ సినిమా, మ‌హేశ్ బాబు హీరోగా న‌టిస్తున్న ‘సర్కారు వారి పాట’, బాల‌కృష్ణ న‌టించిన ‘అఖండ’ వంటి చిత్రాలకు స్వరాలు సమకూరుస్తున్నాడు తమన్.

http://

#VakeelSaab ON AIR @emirates my journey at 37000 feet is blessed ❤️ #VakeelSaabBGM on #Nov16th ♥️🎧🎵✈️ pic.twitter.com/yfuEUBuB6O
— thaman S (@MusicThaman) October 23, 2021

Read more RELATED
Recommended to you

Exit mobile version