Thanu sri datthu :బాలీవుడ్ నటి తనుశ్రీ దత్త ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమె అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. తాజాగా ఈ చిన్నది తనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా ఆ వీడియో హాట్ టాపిక్ గా మారుతుంది. అందులో తనుశ్రీ తనను వేధిస్తున్నారంటూ బోరున ఏడుస్తోంది. నా ఇంటికి వచ్చి కొందరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు.
బూతులు తిడుతూ టార్చర్ చేస్తున్నారు. నా ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణిస్తోంది. నాకు ఎవరైనా సహాయం చేయండి అంటూ తనుశ్రీ బోరున విలపిస్తోంది. కాగా నటుడు నానా పాటేకర్ పై తనుశ్రీ గతంలోనే లైంగిక వేధింపుల కేసు పెట్టగా… కోర్టు కొట్టి వేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి పాటేకర్ గుండాలు తనను టార్చర్ చేస్తున్నారంటూ గతంలోనే ఆమె ఆరోపణలు చేశారు. తాజాగా ఇప్పుడు ఈ వీడియోను కూడా షేర్ చేసుకోవడంతో ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారుతుంది. దీంతో కొంతమంది తనుశ్రీకి సపోర్ట్ చేస్తుండగా మరికొంతమంది అన్ని తప్పుడు ప్రచారాలు చేస్తుందని కామెంట్లు చేస్తున్నారు.