విజయవాడ ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు ఆలయ అధికారులు. ఈ సంవత్సరం థితుల హెచ్చుతగ్గుల కారణంగా 11 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ అధికారులు స్పష్టం చేశారు. 22న ఉదయం అమ్మవారికి స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.

అక్టోబర్ 2న పూర్ణాహుతి, సాయంత్రం కృష్ణా నదిలో హంస వాహన సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా… ప్రతి సంవత్సరం అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వెళతారు.