ఆ చిన్న తప్పు వల్ల ఈ నటుడు కొన్ని కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నాడట!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న ఆహుతిప్రసాద్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఆయన కామెడీ టైమింగ్ తో ప్రతి ఒక్క ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే వారు. 300కు పైగా సినిమాలలోనటించి మంచి నటుడిగా పేరు పొందాడు. మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్న ఆయన విక్రమ్ సినిమాతో మొదటి సారిగా నటుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తరువాత కొన్ని సీరియల్స్ లో కూడా నటించి వాటి ద్వారా గుర్తింపు తెచ్చుకొని ఆహుతి సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు.

ఇక దాంతో ఈయనకు అప్పటినుంచి ఆహుతిప్రసాద్ అనే పేరుతో పిలవడం జరుగుతోంది. ఈయన ఎక్కువగా నెగిటివ్ రోల్స్ చేసే పాత్రలలోనే ప్రేక్షకులను మెప్పించారు. వచ్చిన ప్రతి పాత్రలో కూడా మంచి విజయాన్ని ప్రదర్శించి తనకంటూ ఓ ఇమేజ్ను ఏర్పరుచుకున్నాడు ఆహుతిప్రసాద్. తనకు అవకాశాలు రాక ముందు కొద్ది రోజుల పాటు యాక్టింగ్ నేర్చుకున్న మధు ఫిలిం ఇండస్ట్రీలో నిర్వహణ బాధ్యతలు కూడా చేపట్టారు. ఇక కొన్ని నిర్మాణ సంస్థలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పని చేశారు.

ఇలా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ వచ్చిన అవకాశాన్ని చేసుకుంటే సినిమాలో నటుడిగా పేరు పొందాడు. అలా ఆయన ఏమాత్రం ఖాళీ లేకుండా సినిమాలు చేసే అవకాశాలను దక్కించుకున్నాడు. అలా వచ్చిన అవకాశాలతో మంచి రెమ్యూనరేషన్ కూడా అందుకునేవారు. ఈయనకు ఎక్కువగా పోలీస్ పాత్రలో నటించే వారు. ఇక ఈయన స్టార్డమ్ తో నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నాడు. అలా తెలుగులో పోలీస్ భార్య సినిమా రైట్స్ ని కొన్ని కన్నడ లో నిర్వహించారు కన్నడ లో కూడా పోలీస్ భార్య సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత రెండు చిత్రాల రైట్స్ కొని నిర్మించగా ఆ చిత్రాలు రెండు అట్టర్ ఫ్లాప్ కావడంతో ఆయనకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. దీంతో ఈయనకి కోట్లలో నష్టం వాటిల్లింది. కేవలం ఆ తరువాత నటన మీద దృష్టి పెట్టి ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమా పాత కమెడియన్గా పేరుపొందాడు. నిర్మాతగా సినిమాలు చేయకుంటే ఈయన మరి ఇంత స్థాయికి ఎదిగే వాడు అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version