ఎన్టీఆర్ రాజకీయ వేదికకు పునాది ఈ సినిమా..అని మీకు తెలుసా?

-

తెలుగు చిత్ర సీమలోనే కాదు రాజకీయ రంగంలోనూ నెంబర్ వన్ గా నిలిచిన వ్యక్తి సీనియర్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. ఇక ఆనాడు తెలుగు ప్రజలు ఎన్టీఆర్ ను కేవలం సినీ హీరోగానే కాకుండా ఓ దేవుడిలా పూజించారు. ఇప్పటికీ అన్న ఎన్టీఆర్ పై ప్రజలకు ప్రేమ ఉందని చెప్పొచ్చు. ఎన్టీఆర్-దర్శక రత్న దాసరి నారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఘన విజయం సాధించాయి. అలా వారి కాంబోలో వచ్చిన ‘బొబ్బిలి పులి’ చిత్ర విశేషాలు తెలుసుకుందాం.

‘బొబ్బిలి పులి’ చిత్రం ఒక రకంగా ఎన్టీఆర్ రాజకీయ వేదికకు పునాదిగా నిలిచింది. ఈ చిత్రం విడుదలై 40 ఏళ్లు పూర్తి కావడం విశేషం. కాగా, ఈ ఫిల్మ్ రిలీజ్ తర్వాతనే సీనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం విశేషం. ‘బొబ్బిలి పులి’ టైటిల్ విని ఎన్టీఆర్ అభిమానులు సంతోషపడిపోయారు. ఇక సినిమా చూసిన తర్వాత వారి ఆనందం రెట్టింపు అయింది.

దాసరి-ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఐదో చిత్రం ‘బొబ్బిలి పులి’. కాగా, ఇది రికార్డులన్నిటినీ తిరగరాసింది. ఇందులో ఎన్టీఆర్ సరసన హీరోయిన్లుగా శ్రీదేవి, జయచిత్ర నటించారు. జేవీ రాఘవులు సంగీతం అందించగా, పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

‘జననీ జన్మభూమి’ ఇప్పటికీ అందరి ఫేవరెట్ సాంగ్. అవినీతి, లంచగొండతనానికి వ్యతిరేకంగా నక్సలైట్ అవతారమెత్తిన పాత్రలో ఎన్టీఆర్ నటన చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కోర్ట్ రూమ్ డ్రామా, క్లైమాక్స్ కూడా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో ఉండగా ఈ చిత్రం విడుదలైంది. అలా ఆయన రాజకీయ ఎదుగుదలకు దోహదపడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version