బిగ్ బాస్ 7 లోకి డివోర్స్ తీసుకున్న సెలబ్రిటీ జంట.. దాని కోసమేనా..?

-

ఈసారి బిగ్ బాస్ ఏడవ సీజన్ ను రసవత్తరంగా నడిపించడానికి బిగ్బాస్ నిర్వహకులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లు గానీ ఆన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు . ఈ క్రమంలోని ఒక ప్రయోగానికి మేకర్లు ప్లాన్ చేసినట్టు తాజా సమాచారం అందుతోంది. బిగ్బాస్ సీజన్ 6 ఎలాగో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు కాబట్టి సీజన్ సెవెన్ ను ఎలాగైనా హిట్ చేసేయాలని పట్టుదలతో ఉన్నారట బిగ్బాస్ టీం.. అందుకోసం ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్ని ప్రయత్నాలు చేసేస్తున్నారని ఇందులో భాగంగానే యాంకర్ రష్మి, అనసూయ లను కూడా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం..

ఇందులో భాగంగానే విడాకులు తీసుకున్న ఒక సెలబ్రిటీ జంటను కూడా హౌస్ లోకి పంపించే ఏర్పాటు చేస్తున్నారట నిర్వాహకులు.. మరి ఆ జంట ఏదంటే..టాలీవుడ్ స్టార్ సింగర్ గా ఒకప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకున్న నోయల్.. ఆయన ఒకప్పటి భార్య నటి ఎస్తేర్.. ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని వేరువేరుగా ఉంటున్నారు.. అంతేకాదు ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చేసుకున్నారు.

మరి ఈ ఇద్దరిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాలని చూస్తున్నారట టీం.. ఇద్దరి మధ్య ఇష్యూస్ గట్టిగానే ఉన్నట్లు.. ఈ విషయంలో ఎస్తేరు కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చి నోయల్ పై దారుణమైన కామెంట్లు చేసింది.. ఇలాంటి సమయంలో వీళ్ళిద్దరిని హౌస్ లోకి పంపిస్తే టిఆర్పి రేటింగ్ పెరుగుతుంది అనే ఆలోచన బిగ్ బాస్ నిర్వాహకులు చేస్తున్నట్లు సమాచారం. మరి ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version