ఇన్నాళ్లూ రాష్ట్ర ప్రజలను చలి చంపేసింది. అడుగు బయట పెట్టాలంటే వణుకు పుట్టింది. కానీ ఒక్కసారిగా రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ఖమ్మం నగరం ఒక్కసారిగా వేడెక్కింది. ఆదివారం రాష్ట్రంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రత ఖమ్మం నగరంలోని ప్రకాశ్‌నగర్‌లో 39 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. సాధారణ ఉష్ణోగ్రత కన్నా నాలుగు డిగ్రీలు పెరిగింది.
మరోవైపు హైదరాబాద్ నగరంలోనూ 35.6, మహబూబ్‌నగర్‌లో 37, మెదక్‌లో 35.8, నల్గొండలో 35.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు శనివారం రాత్రి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)లో 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కామారెడ్డి, ఆదిలాబాద్, సంగారెడ్డి, నిర్మల్, రంగారెడ్డి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 12 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమ, మంగళవారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపు నమోదవుతాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.