నేపాల్ థియేటర్‌లో జనాల అరుపులే అరుపులు..‘ఆర్ఆర్ఆర్’ మేనియా..

-

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రేక్షకుల ముందకు వచ్చి వారి విశేష ఆదరణ పొందుతోంది. మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. భారీ అంచనాలతో ఈ నెల 25న విడుదలైన పిక్చర్.. అంచనాలకు మించిన విజయాన్ని అప్పుడే సాధించి, రికార్డుల వేటలో తలమునకలైంది.

సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా ‘ఆర్ఆర్ఆర్’ మేనియా కొనసా..గుతోంది. మన దేశంలో మాత్రమే కాదు.. విదేశాల్లోనూ సినిమా బాగా ఆడుతోంది. మూడు గంటల పాటు ప్రేక్షకులను థియేటర్ లో కట్టి పడేశాడు రాజమౌళి అని జనాలు చర్చించుకుంటున్నారు. నేపాల్ దేశంలోని ఓ థియేటర్ లో జరిగిన సందడిని ట్విట్టర్ వేదికగా ఓ యూజర్ షేర్ చేయగా, ఆ వీడియో నెట్టింట బాగా వైరలవుతోంది. అలా ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ ఫీవర్ ఇంకా కొనసాగుతోంది. థియేటర్లలో అభిమానులు స్టెప్పులతో అదరగొట్టేస్తున్నారు.

నేపాల్ లో ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ రిలీజ్ అయిన థియేటర్ల వద్ద సినీ ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. థియేటర్ లో సినిమాను చూసి ఆనందంతో కేరింతలు కొడుతూనే ఉన్నారు. అలా అరుస్తున్న వీడియోలను చూసి భారతీయులు గర్వపడుతున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు వారు అయితే తల ఎత్తుకుంటున్నారు.

తెలుగు వాడు అయిన రాజమౌళి తెలుగు చిత్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటాడంటూ కొనియాడుతున్నారు. అభిమానులు కేరింతలు కొడుతూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియానుఊపేస్తున్నాయి. ‘ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్’ క్రేజ్ నేపాల్‌లో కొనసాగుతూ..నే ఉందని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version