కువైట్ లో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

-

రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోడీ శనివారం కువైట్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గల్ఫ్ దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. కువైట్ చేరుకున్న వెంటనే ప్రభాస భారతీయులతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. ఆ తర్వాత కువైట్ సిటీలో మాజీ ఐఎఫ్ఎస్సి అధికారి 101 ఏళ్ల మంగల్ సేన్ హాండాను కూడా ప్రధాని మోదీ కలిశారు.

అయితే ప్రధాని మోదీ రాకతో కువైట్ లో నివసిస్తున్న ప్రవాస ఆంధ్రుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇది భారతీయుల పెద్ద విజయం అంటూ ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఈ పర్యటనలో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం, రక్షణ సహకార ఒప్పందం కోసం కువైట్ తో చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇక కువైట్ లో “హలా మోదీ” పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత్ నుంచి ఇక్కడికి చేరుకునేందుకు మీకు నాలుగు గంటలు పట్టింది.. కానీ ప్రధానికి మాత్రం నాలుగు దశాబ్దాల సమయం పట్టిందన్నారు. 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని కువైట్ లో పర్యటించడం విశేషం. గతంలో ఇందిరాగాంధీ కువైట్ లో పర్యటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version