సంధ్య థియేటర్ తొక్కీసలాట ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కారనంగానే సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట జరిగిందని అన్నారు రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ ని ఉద్దేశించి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి.
అంతేకాదు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినందుకు ప్రభుత్వాన్ని తప్పుపడుతూ నీచమైన భాషలో కామెంట్స్ చేశారని అన్నారు రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై తాజాగా తన తండ్రి అల్లు అరవింద్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు హీరో అల్లు అర్జున్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను మాట్లాడే విషయాలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి అందుకే ఇంత సమయం తీసుకున్నారని అన్నారు.
అందుకే మీడియా మిత్రులను వెయిట్ చేయించాను అని చెబుతూ సారీ చెప్పారు. ఇక సంధ్య థియేటర్ ఘటన ఒక యాక్సిడెంట్ అని.. అది అనుకోకుండా జరిగిందన్నారు. ఈ ఘటన జరిగినందువల్ల రేవతి కుటుంబానికి క్షమాపణలు తెలియజేశారు. సంధ్య థియేటర్ ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు. ఇందులో ఎవరి తప్పు లేదన్నారు అల్లు అర్జున్. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.