అనుష్క – ప్రభాస్ రిలేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్ హీరో గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ అలాగే లేడీ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాలలో నటించిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బిల్లా, మిర్చి, బాహుబలి రెండు సినిమాలలో నటించి మంచి పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ – అనుష్క ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని వార్తలు కూడా వినిపించాయి. అంతేకాదు వివాహం అనంతరం ఉండడానికి అమెరికాలో ఒక ఇల్లు కూడా తీసుకున్నారు అని.. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమా ప్రాజెక్టుతో బిజీగా ఉండడం వల్లే అనుష్క కూడా వివాహం చేసుకోకుండా ప్రభాస్ కోసం ఎదురుచూస్తోంది అంటూ రకరకాల వార్తలు వెలువడ్డాయి.

ఇదిలా ఉండగా తాజాగా దర్శకుడు మెహర్ రమేష్.. అనుష్క శెట్టి – ప్రభాస్ మధ్య ఉన్న రిలేషన్ గురించి ఊహించని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇకపోతే హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన అరుంధతి సినిమా ఎలాంటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే.

అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్టు సాధించడమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది .ఆ సమయంలో స్టార్ హీరోల సినిమాలు కూడా వెనుకబడిపోయాయి . అంతలా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది అనుష్క. ఈ సినిమా తరువాత ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమాలో గ్లామర్ వొలకబోసింది ఈ ముద్దుగుమ్మ. అరుంధతి సినిమాలో జేజమ్మ లాంటి గొప్ప క్యారెక్టర్ లో నటించి… బిల్లా సినిమాలో బికినీ వేసుకొని అందాలు ఆరబోసింది..

ఈ క్రమంలోనే మెహర్ రమేష్ అనుష్క – ప్రభాస్ ల మధ్య రిలేషన్ గురించి మాట్లాడుతూ.. వారిద్దరి కెమిస్ట్రీ గురించి చెప్పాలి అంటే.. ఆ ఇద్దరు నేషన్స్ బెస్ట్ పెయిర్. ఒక బిల్లా సినిమాలోనే కాదు మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలలో కూడా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు . ప్రస్తుతం ఈ కామెంట్లు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version