లూసిఫర్ లో లేనిది.. గాడ్ ఫాదర్ లోఉన్నది ఇదే అంటున్న డైరెక్టర్..!!

-

ప్రముఖ మళయాలం బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం లూసిఫర్ ను తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చిరంజీవి హీరోగా నటిస్తుండగా సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనిపై ఈ సినిమా మీద అంచనాలు పెరుగుతున్నప్పటికీ లూసీఫర్ ను దించేశారు.. ఇక ఇందులో కొత్తగా ఏముంది అంటూ నెటిజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో సత్యదేవ్, నయనతార , వెన్నెల కిషోర్ , సునీల్ తో పాటు మరికొంతమంది కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక కొనిదెల సురేఖ సమర్పణలో ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం దసరా పండుగ సందర్భంగా రేపు విడుదల కాబోతోంది. ఇక ఈ క్రమంలోనే నెటిజనుల ఆలోచనలకు తగ్గట్టుగా వారి సందేహాలను నివృత్తి చేయడానికి ఈ సినిమా దర్శకుడు మోహన్ రాజా పలు విషయాలను పంచుకున్నారు.

లూసిఫర్లో లేని ఒక కోణం గాడ్ ఫాదర్ లో ఉంటుంది.. కథను అలాగే ఉంచి ఫ్రెష్ స్క్రీన్ ప్లే చేశాను. ఇందులోని 10 పాత్రలు చాలా సర్ప్రైజింగ్ గా ఉంటాయి. ముఖ్యంగా గాడ్ ఫాదర్ చిరంజీవి గారి ఇమేజ్ కి తగ్గట్టుగా ఉంటుంది. ఇండియాలో ఒక ముగ్గురు మాత్రమే ఇలా ఉంటారు. లూసిఫర్లో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రలో సల్మాన్ ఖాన్ చేస్తే బాగుంటుందనే ఆలోచన కూడా నాదే.. అందులో నేను రామ్ చరణ్ ని అడగగానే చిరంజీవి పై ఉన్న ప్రేమతో ఈ మూవీ ఒప్పుకున్న సల్మాన్ ఖాన్ కు ధన్యవాదాలు. ఇకపోతే నేను గాడ్ ఫాదర్ అనే హిట్ సినిమా అవ్వబోతుండడం సంతోషంగా ఉంది.

మలయాళం లో లూసిఫర్ 2 మొదలైంది.. ప్రస్తుతం నా దృష్టి గాడ్ ఫాదర్ పైనే ఉంది. కచ్చితంగా ఈ సినిమా సీక్వెల్ కి మంచి కంటెంట్ కూడా ఉంది. ఇక ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందిస్తుందని అనుకుంటున్నాను అంటూ ఆయన తెలిపారు. మొత్తానికైతే సినిమా విడుదల సమయంలో మోహన్ రాజా ఇలా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మాట్లాడడం అందరిని సినిమా వైపు తీసుకెళ్తుందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version