అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మీడియం బడ్జెట్ సినిమాలివే!

-

ఇటీవల కాలంలో వచ్చిన టాలీవుడ్ మీడియం రేంజ్ మూవీస్ కొన్నిసంచలన విజయాలు సాధించి అత్యధిక లాభాలు తీసుకొచ్చాయి. అలాంటి టాప్ 10 సినిమాలేంటో చూద్దాం..

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్​గా తెరకెక్కిన సినిమా కార్తికేయ 2. ఆగష్టు 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి అంతటా సంచలనం సృష్టిస్తూ రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లకి పైగా రాబట్టింది. ఈ సినిమా ఓటీటీ వేదికగా జీ5లో అక్టోబర్ 5నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఇటీవల కాలంలో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకొన్న సినిమాల జాబితాలో సీతారామం చేరింది. దుల్కర్, మృణల్ ఠాకుర్ జంటగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 100కోట్ల వసూళ్లు సాధించింది. ఈ చిత్రం అమెజాన్​లో స్ట్రీమింగ్ అవుతుంది.

క‌ల్యాణ్‌రామ్ హీరోగా హిస్టారిక‌ల్ పాయింట్‌కు టైమ్ ట్రావెల్‌, ఫాంట‌సీ అంశాల‌ను జోడిస్తూ ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ మ‌ల్లిడి ఈ సినిమాను తెర‌కెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా త్వరలో జీ5వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

గీత గోవిందం విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని పరశురామ్ తెరకెక్కించాడు. ఈ చిత్రం 55 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది.

ఫిదా సినిమా వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబినేషన్‌లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అచ్చమైన తెలంగాణ ప్రేమకథ ఫిదా. ఈ చిత్రం 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే 49 కోట్ల షేర్ వసూలు చేసింది.

పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ చిత్రం దాదాపు 39 కోట్ల షేర్ వసూలు చేసింది.

అర్జున్ రెడ్డి సినిమా అర్జున్ రెడ్డి సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించాడు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 5 కోట్లు మాత్రమే.. 26 కోట్లు పైగా వసూలు రాబట్టింది.

మజిలీ చైతూ, సమంత కలిసి నటించిన తొలి సినిమా ఈ చిత్రం 39 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ చిత్రం 19.2 కోట్ల లాభాల్ని తీసుకొచ్చింది.

అ..ఆ. నితిన్, సమంత జంటగా నటించిన ఈ సినిమాకు 20 కోట్లకు పైగానే లాభాలు వచ్చాయి. ఈ చిత్రం 49 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది.

నేచురల్ స్టార్ హీరోగా మారుతి తెరకెక్కించిన భలే భలే మగాడివోయ్. చిత్రం 19 కోట్ల లాభాల్ని తీసుకొచ్చింది. 27 కోట్లకు పైనే షేర్ వసూలు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version