ఫిలిం ఇండస్ట్రీలో నటీనటులు ఎప్పుడు .. ఎలాంటి స్థాయికి చేరుకుంటారో చెప్పడం కష్టం. ముఖ్యంగా మన పెద్దవాళ్ళు చెబుతూ ఉండేవారు కదా ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలవుతాయి అని.. అయితే ఈ సామెత సినిమా వాళ్లకు బాగా సెట్ అవుతుందని చెప్పవచ్చు. ఒకప్పుడు ఉన్నతంగా బతికిన వాళ్ళు చివరి క్షణాలలో ఏమీ లేకుండా అనాధలుగా చనిపోతూ ఉంటారు. కొంతమంది చివరకు వచ్చినప్పుడు చాలా కష్టాలు పడి ఆ తర్వాత ఉన్నతంగా బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక పోతే కొంతమంది అవకాశం ఇచ్చిన వారిని దేవుళ్ళుగా చూస్తే మరికొంతమంది వారికి పాఠాలు చెబుతూ ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖ రాజనాల కూడా ఒకరు.
ఏదైనా వేషం కావాలంటూ కొండలరావు దగ్గరికి వచ్చారట. ఈ క్రమంలోనే ఒక సినిమాలో ముసలి తండ్రి పాత్రను కొండలరావు చేయాల్సి ఉండగా.. ఆ పాత్రను చిత్రబృందం తో మాట్లాడి ఆయనకు వచ్చేలా చేశారు. కానీ ఈ సినిమా షూటింగ్ సమయంలో దర్శకనిర్మాతలకు తలనొప్పి తెప్పించారట. సీనియర్ కాబట్టి ఏ సీన్ ఎలా తీయాలో అనేది దర్శకులకు రాజనాల ఎక్కువగా వివరించడం జరిగింది. ఇక దర్శకుడు వెంటనే కొండల రావు కి ఫోన్ చేసి ఈయనను మాకు తగిలించారు ఏంటి అని అడిగితే ఏం చేయలేము ఆయన సీనియర్ కదా కొన్నాళ్లపాటు భరించక తప్పదని షూటింగ్ పూర్తి చేశారు.