డివివి దానయ్య అనగానే వెంటనే గుర్తొచ్చే సినిమా ఆర్ ఆర్ ఆర్.. ఇక తాజాగా ఆయన కుమారుడి వివాహం చాలా ఘనంగా జరిగింది.. ఇకపోతే నిర్మాత దానయ్య కుమారుడి పెళ్లి వేడుకకు టాలీవుడ్ సినీ సెలబ్రిటీలంతా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రముఖ నిర్మాతగా టాలీవుడ్ లో కొనసాగుతున్న ఈయన ఎంతోమంది స్టార్ హీరోలతో బడా చిత్రాలను నిర్మించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్గా రాజమౌళి, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కాంబినేషన్లో ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే దీంతో ఆయన పాపులారిటీ దేశవ్యాప్తంగా వ్యాపించింది ఇప్పుడు తన కుమారుడికి వివాహం జరిపించి మరొకసారి వార్తల్లో నిలిచారు.
సమత అనే అమ్మాయితో దానయ్య కుమారుడు కళ్యాణ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వివాహ వేడుక జరగగా.. ఈ వివాహానికి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రశాంత్ నీల్ , రాజమౌళి, రమా రాజమౌళి ఇలా తదితరులంతా హాజరయ్యారు ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక మరొకవైపు దానయ్య కుమారుడు కళ్యాణ్ హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం కళ్యాణ్ జాంబిరెడ్డి దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి అధీర అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు ఇక దానయ్యే ఈ సినిమాని స్వయంగా నిర్మిస్తూ తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యత కూడా తీసుకున్నారు. ఇక ప్రస్తుతం దానయ్య సుజిత్ దర్శకత్వంలో ఓ జి అనే యాక్షన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే.