తెలుగు సినీ నటుడు, కమెడియన్ సుధాకర్ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సుధాకర్ సోమవారం తన నివాసంలో స్వల్ప స్వస్థతకు గురికావడంతో ఆయనని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రెండేళ్ల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన 40 రోజులు కోమాలో ఉండి కోలుకున్న విషయం తెలిసిందే.
అప్పటినుండే కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు సుధాకర్. ఇక సుధాకర్ తమిళ్ లో దాదాపు 40 సినిమాల్లో హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హీరో నుండి హాస్యనటుడిగా మారి అద్భుతంగా నటించి బ్రేక్ తీసుకొని కనిపించకుండా పోయాడు సుధాకర్.