ప్రముఖ యాంకర్ ఓంకార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సుదీర్ఘకాలంగా నిర్మాతగా, యాంకర్ గా, దర్శకుడిగా కూడా వ్యవహరిస్తూ ఆడియన్స్ ను అలరిస్తున్న ఈయన బుల్లితెరపై ఎన్నో రకాల షోలు చేస్తూ సస్పెన్షన్ తోనే అందరికీ హార్ట్ ఎటాక్ తెప్పిస్తూ ఉంటాడు. అంతలా తన షోలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా ఓంకార్ సిక్స్త్ సెన్స్ అనే ఒక టెర్రిఫిక్ షో ని చాలా ఏళ్ల క్రితమే మొదలుపెట్టారు. అయితే ఈ షో లో ఈసారి ఎవరు ఊహించని విధంగా ఒక ఎమోషనల్ సంఘటన జరిగింది. అయితే ఏమైంది అనేది ఇప్పుడు చూద్దాం.
ప్రతి శని, ఆదివారాల్లో వచ్చే ఈ షో స్టార్ మా లో ప్రసారం అవుతుంది. తాజాగా వచ్చేవారం ఎపిసోడ్ ల కోసం జెడి చక్రవర్తి, ఈశా రెబ్బ టీం తో పాటు ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు నటించిన హిడింబా మూవీ టీం కూడా వచ్చి సందడి చేసింది. ఇక ఇందులో నందిత తన బాధల గురించి స్ట్రగుల్స్ గురించి చెప్పుకుంటూ ఎమోషనల్ అయింది. అలాగే తన తండ్రి ఆఖరి రోజుల్లో ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను వివరిస్తూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది. అప్పటివరకు అంతా బాగానే ఉన్నా గేమ్ ఆడటానికి వచ్చిన అశ్విన్ బాబును కూడా ఓంకార్ నీ లైఫ్ లో ఏదైనా బాధను నాకు చెప్పకుండా దాచి పెట్టావా అని సూటిగా అడిగాడు.
దాంతో అశ్విన్ స్ట్రగుల్స్.. నా లైఫ్ లో జరిగిన వాటిని అన్నీ కూడా నేను నీతో చెప్పుకోలేదు అని.. నేరుగానే తన అన్నతో చెప్పేయడం చాలా బాధ కలిగించింది.. అందులో ఒక స్ట్రగుల్ గురించి నాకు చెప్పు అని.. నాన్న అయినా.. అన్నైనా అన్ని నేనే కదా నీకు.. నాకు చెప్పడానికి ఏంట్రా అంటూ ఓంకార్ అడగగా.. అప్పుడు అశ్విన్ ఇప్పటివరకు చూసుకుంటూనే ఉన్నావు.. ఇంకా నిన్ను ఏం ఇబ్బంది పెడతానన్నయ్య.. నిన్ను అడగాలంటే అంటూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా గుండె బరువెక్కి.. కన్నీటి పర్యంతం అవుతున్నారు.