ఫిదా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని ఆ తర్వాత డ్యాన్సింగ్ క్వీన్ గా మంచి పేరు సంపాదించుకున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2014లో మలయాళ చిత్రం ప్రేమలో కూడా హీరోయిన్గా నటించి మెప్పించింది. ఇక ఫిదా సినిమా తర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయి, కణం, పడి పడి లేచే మనసు , మారి 2 వంటి చిత్రాలలో నటించి మెప్పించిన ఈ చిన్నది.
శేఖర్ కమ్ముల ,నాగచైతన్య కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ చిత్రంలో కూడా నటించింది. అయితే, తండెల్ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆమె భారీగా పారితోషికం డిమాండ్ చేసినట్లు టీటౌన్ లో టాక్ నడుస్తుంది. దాదాపు రూ. 3కోట్ల మేర డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇందుకు నిర్మాతలు సైతం ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.