టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా దేవర షూటింగ్ లో చాలా బిజీ గా ఉన్నాడు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు. దేవర సినిమాను రెండు పార్ట్ లుగా విడుదల చేయడానికి సినిమా బృందం ప్లాన్ లో ఉందట. అందుకు అనుగుణంగానే షూటింగ్ ను ప్లాన్ చేసుకున్నారట.
అయితే, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న “వార్-2” సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ భారీ బడ్జెట్ మూవీని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో 2025 ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. “వార్-2” లో హృతిక్ కు దీటుగా నెగిటివ్ షేడ్స్ తో కూడిన పవర్ఫుల్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తారని సినీ వర్గాల సమాచారం.