బాక్సాఫీస్ వద్ద ‘కాశ్మీర్ ఫైల్స్’ కనకవర్షం… రికార్డ్ కలెక్షన్లు వసూలు చేస్తున్న మూవీ

-

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ మానియా నడుస్తోంది. ప్రధాని మోదీ దగ్గర నుంచి బీజేపీ నేతలంతా కాశ్మీర్ ఫైల్స్ సినిమాని ప్రశంసిస్తున్నారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాలు ఈ సినిమాను చూసేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ఏకంగా సెలవు ప్రకటించింది. వివేక్ అగ్రిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 90ల్లో కాశ్మీర్ లో పండిట్లపై జరిగిన దమనకాండను చూపించింది. కాశ్మీర్ లో హిందువులపై కొనసాగిన అత్యాచారాలు, హత్యాకాండపై, కాశ్మీర్ నుంచి పండిట్ల వలసలు ప్రధాన కథాంశంగా సినిమాను నిర్మించారు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈసినిమా ప్రేక్షకుల ఆదరణను పొందుతోంది. అనుపమ్ ఖేర్, మిథన్ చక్రవర్తి వంటి సీనియర్ యాక్టర్లు సూపర్ ఫెర్పామెన్స్ చేశారు. 

ఇదిలా ఉంటే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. సినిమాపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నా… కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. మొదటి రోజు కేవలం రూ. 3.55 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా… రెండో రోజు నుంచి కలెక్షన్లను కురిపిస్తోంది. రెండో రోజు రూ. 8.50 కోట్లు, మూడో రోజు రూ. 15.50 కోట్లు, నాలుగో రోజు రూ. 15.05 కోట్లు, ఐదోరోజు రూ. 18.02 కోట్లు, మొత్తంగా రూ.60.22 కోట్లను వసూలు చేసింది. మరికొన్ని రోజుల్లో రూ. 100 కోట్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version