నేడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. నేడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పుఇవ్వనుంది నాంపల్లి కోర్టు. ఇప్పటికే బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న అల్లు అర్జున్…నాంపల్లి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోననే భయంతో ఉన్నారు.
ఇక అటు పుష్ప 2 ప్రొడ్యూసర్స్ కు తెలంగాణ రాష్ట్ర హై కోర్టు లో ఊరట లభించింది. సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో ప్రొడ్యూసర్లు ఎలమంచిలి రవి శంకర్, నవీన్ పిటిషన్ దాఖలు చేశారు. సంధ్య థియేటర్ ఘటన పై తమ మీద నమోదు చేసిన కేసు ను కొట్టివేయాలని పిటిషన్ వేశారు ప్రొడ్యూసర్లు ఎలమంచిలి రవి శంకర్, నవీన్. థియేటర్ భద్రత తమ పరిధి కాదని పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపించారు. తమ బాధ్యత గా ముందే పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు.